అంశము : ఐఐఐటి వారి తెలుగు వికీపీడియా ప్రయోగశాల (SANDBOX) పరిచయము

పాఠ్య లక్ష్యం: తెలుగు వికీపీడియా ప్రయోగశాల (SANDBOX) పై అవగాహన, ప్రయోగశాలలో నమోదు చేసుకోవటం, ప్రయోగశాల ఉపయోగములు తెలుసుకొంటారు.

ఈ పాఠములో -

  1. ఐఐఐటి తెవికి ప్రయోగశాల పరిచయము- పాఠ్యము 10 నిమిషములు (తెవికీ ఐఐఐటి ప్రయోగశాలను సందర్శించుట, ప్రయోగశాలలో నమోదు చేసుకోనుట, తరచుగా అడిగే ప్రశ్నలు)
  2. తెవికి ప్రయోగశాల అవగాహన - వీడియో 5.53 నిమిషములు (తెవికీ ఐఐఐటి ప్రయోగశాలను సందర్శించుట, ఖాతాలోకి లాగ్ in అయ్యి ప్రయోగశాలలో వ్యాసము రాయటం నేర్చుకొనుట వీడియోలో చూసి తెలుసుకోవచ్చు)
  3. తెవికి ప్రయోగశాలలో ఖాతా సృష్టించటం - వీడియో 4.12 నిమిషములు (తెవికీ ఐఐఐటి ప్రయోగశాలలో ఖాతా సృష్టించుకోవటానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది)
  4. అభ్యాసము
  5. అభ్యాస ఫలితం : పాఠము ముగిసే సరికి, తెలుగు వికీపేడియాలో వ్యాసాలు వ్రాయటానికి ముందు ఎందుకు తెవికీ ఐఐఐటి ప్రయోగశాలను ఎందుకు వాడాలి, ప్రయోజనాలు తెలుసుకొంటారు, మీ ఖాతా సృష్టించుకొంటారు.

ఐఐఐటి తెవికి ప్రయోగశాల పరిచయం

  1. తెలుగు వికీపీడియాలో మొదటి సారి వ్రాయాలి అనుకునే ప్రాథమిక వాడుకదారులకు వికీపీడియా ఇంటర్ఫేస్ నేర్చుకునేందుకు ఐఐఐటి తెవికిప్రాజెక్టు ఈ ప్రయోగశాల ఈ ప్రవేశపెట్టింది.
  2. ఇది మీడియా వికీ సహకారముతో ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టు అద్వర్యంలో చేయబడిన తెలుగు వికీపీడియా నకలు
  3. ఇందులో మీరు తెలుగు వికీపీడియాలో గల రకరకాల పేజీల గురించి, వెబ్ సైట్ లో నావిగేషన్ చెయ్యటం ఎలా, ఇతర ఫీచర్లు గురించి నేర్చుకుంటూ దీనిమీద ప్రయోగాలు చేయచ్చు
  4. ఈ క్రింది వెబ్ అడ్రస్ పై క్లిక్ చేసి ప్రయోగశాలను చేరుకోండి

https://tewiki.iiit.ac.in/

  1. ఇందులో కూడా వాడుకరి, ఖాతా సృష్టించుకోవచ్చు, లాగిన్ పాస్వర్డ్ మార్పులు, ఇంటరుఫేసు వంటివి నేర్చుకోవచ్చు
  2. ఇది కేవలం తెలుగు వికీపీడియా ను నేర్చుకునేందుకు ఉద్దేశించినది
  3. ఇందులో రాసిన వ్యాసాలు, వాటిలో చేసిన మార్పులు, చేర్పులు ప్రయోగశాల వరకే పరిమితం
  4. ఇందులో ఎలాంటి దోషాలు లేకుండా రాయగలిగిన తరువాత అసలు వికీపీడియాలో సులువుగా రాయవచ్చు.
  5. ఇందులో ప్రాక్టీసు చేస్తున్నపుడు ఏమైనా ఇబ్బందులు ఎదురుకొంటే , ప్రాజెక్టు టీం మీ సమస్యను పరిష్కరించగలదు.
  6. ఇది ఆన్లైన్ లోఅందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా , ఎక్కడైనా, ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు.

గూగుల్ అడ్రస్ బార్ లో https://tewiki.iiit.ac.in/ అని టైపు చెయ్యండి. ENTER బటన్ నొక్కండి.

alt-text-here

  1. https://tewiki.iiit.ac.in/ పేజీ లో కుడిచేతి వేపు create account అనే లింక్ కనిపిస్తుంది.
  2. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు తెవికి ప్రయోగశాలలో (SANDBOX) అకౌంట్ సృష్టించుకోండి.

alt-text-here

Tewiki లో ఖాతా సృష్టించడం

  1. Create account పై క్లిక్ చేస్తే ప్రత్యేక పేజీ కనిపిస్తుంది
  2. ఇందులో మీరు మీ username, password. మీ email వివరాలు పొందుపరచాలి.
  3. కొందరు వారి కలం పేరుని, మారు పేరుని ఇక్కడ username క్రింద వాడుతారు. అందుకే tewiki చివరిలో అసలు పేరు చెప్పమంటుంది. ఇది ఐచ్ఛికము.
  4. మీ ఇమెయిల్ అడ్రస్ కుడా అడుగుతుంది. ఇది కుడా ఐచ్ఛికము. ఇమెయిల్ అడ్రస్ ఇవ్వటం వలన మీరు ప్రయోగశాలలో చేస్తున్న ప్రయోగాభ్యాసము సరిదిద్దుటకు, మీకు తెలియనివి నేర్పుటకు సులువు అవుతుంది.
  5. తరువాత మీరు రోబోట్ కాదు మానవులే అని తెలుసుకోవటానికి ఒక capcha ఇవ్వబడుతుంది, దానిని పూర్తి చెయ్యండి
  6. క్రింద వున్న మీ ఖాతాను సృష్టించుకోండి బటన్ నొక్కండి.

alt-text-here

తరచుగా అడిగే ప్రశ్నలు

  1. https://tewiki.iiit.ac.in/ ఉపయోగం ఏమిటి ?
    వికీపీడియాలో మనం ఏ వ్యాసమైన చదవచ్చు, దానిని సరిదిద్దవచ్చు. కొత్తగా వికీపీడియాలో రాసేవారికి, వారు రాసిన వ్యాసము వెంటనే publish అవుతుంది, అందరూ చదువుతారు,ఏమైనా తప్పులు ఉంటే అన్న విషయం మీద కొంచెం బిడియం ఉంటుంది. అలాంటి ఇబ్బంది కలగకుండా తెలుగు వికీపీడియా బాగా నేర్చుకునేందుకు తయారుచేయబడిన ప్రయోగశాల platform ఇది.
  2. వికీపీడియాలో ఖాతాఉంటే ఇందులో లాగ్ ఇన్ చేసుకోవచ్చా ? ఇది ఐఐఐటి వారిచే చేయబడిన సైటు, కాబట్టి వేరొక ఖాతా సృష్టించు కోవాలి.
  3. ఇందులో ఏమైనా రాయవచ్చా ?
    వికీపీడియాలో వ్యాసానికి ఎటువంటి నింబంధనలు ఉంటాయో , దీనికి కూడా అవే వర్తిస్తాయి కాకపొతే మీరు రాసిన వ్యాసము వెంటనే మార్పులకు లోనవకుండా ఇందులో కొంచెం వెసులుబాటు ఉంటుంది.
  4. ఇందులో రాసిన కంటెంట్ నేను రాయబోయే వికీ వ్యాసము లోనికి కాపీ చేయవచ్చా
    చేయవచ్చును
https://docs.google.com/forms/d/1NV5pXxo0Ga5NuLwQOZeDnDfHYhvwPn5U-1SNx2KE730/viewform?ts=5f112f8c&edit_requested=true/